హఫీజ్‌ సయీద్‌ ఉగ్రవాదే : పాకిస్తాన్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 10:32 AM
 

ఇస్లామాబాద్‌ : 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ ఉగ్రవాదేనని పాకిస్తాన్‌ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో పాకిస్తాన్‌కు సయీద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించక తప్పలేదు. సయీద్‌కు చెంఇన జమాద్‌ – ఉద్‌ – దవా (జెయుడి) ప్రధాన కార్యాలయం వద్ద ఆ సంస్థ సభ్యులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించిన అనంతరం ప్రభుత్వం సయీద్‌ను ఉగ్రవాదిగా పేర్కొంది. భద్రత పేరుతో జెయుడి సభ్యులు దాదాపు దశాబ్దం క్రితం బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాము జెయుడి ప్రధాన కార్యాలయంతో సహా 26 ప్రదేశాల్లో బారికేడ్లు తొలగించామని లాహోర్‌ డిఐజి డాక్టర్‌ హైదర్‌ అష్రాఫ్‌ చెప్పారు.