నేడు స్టాక్‌ మార్కెట్లకు సెలవు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 10:28 AM
 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ సెలవును పాటిస్తున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈక్విటీ, ఫారెక్స్‌, మనీ మార్కెట్లన్నీ నేడు ట్రేడింగ్‌ను నిలిపివేశాయి. దేశీయ మార్కెట్లు నిన్న లాభాలతో ముగిశాయి. 294 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 34,300 వద్ద ముగియగా, 84 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10,539 వద్ద క్లోజైంది.