మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్‌ సర్వీసులు

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 05:07 PM
 

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు విశాఖ ఆర్టీసీ ఆర్‌ఎం తెలిపారు. సింహాచలం, మధురవాడల నుంచి 10 ప్రత్యేక బస్సులు, అలాగే కొత్తవలస, చోడవరం, గాజువాక, అనకాపల్లి, ఆరిలోవ నుంచి 15 బస్సులు సాగరతీరానికి నడపనున్నట్లు పేర్కొన్నారు. కల్యాణపులోవ జాతరకు రావికమతం నుంచి 16, కొత్తకోట నుంచి 11, నర్సీపట్నం నుంచి 16 బస్సు సర్వీసులు ఆర్టీసీ నడపన ుంది. నర్సీపట్నానికి 35 కి.మీ. దూరంలో ఉన్న ధారమట్టం క్షేత్రానికి 30 స్పెషల్‌ బస్సులు, పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్యగుండం శైవక్షేత్రానికి 18 బస్సు సర్వీసులు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సమీపంలో గల అప్పికొండ శైవక్షేత్రానికి 40 బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు.