హామీల‌పై పోరాటానికి ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంది : జేపీ

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 03:18 PM
 

విభ‌జ‌న హామీల‌పై పోరాటానికి ఇప్ప‌టికే ఆల‌స్య‌మైందని అన్నారు లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌. ఉండ‌వ‌ల్ల‌, సీపీఐ రామ‌కృష్ణ‌తో స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న .. రాష్ర్ట ప్ర‌భుత్వం ఆర్భాటం ప్ర‌చారం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని మండిప‌డ్డారు. రాష్ర్ట అభివృద్ధి మా ప్ర‌య‌త్నంగా ఉడ‌త సాయం చేస్తామ‌ని అన్నారు. చిత్త‌శుద్ధి త‌ప్ప మా ద‌గ్గ‌ర వేరే బ‌లం లేదన్న జేపీ.. ఆ చిత్త‌శుద్ధితోనే నిజాలు నిగ్గుతేలుస్తామ‌ని అన్నారు.