జేఏసీకి అండ‌గా ఉంటాం : సీపీఐ రామ‌కృష్ణ

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 03:16 PM
 

రాష్ర్టానికి జ‌రిగిన అన్యాయంపై ప్ర‌త్యేక హోదా విభజ‌న హామీల సాధ‌న స‌మితిని ఏర్పాటు చేసి గ‌త మూడేళ్లుగా పోరాటం చేస్తున్నామ‌ని సీపీఐ రామ‌కృష్ణ తెలిపారు. జేపీ, ఉండ‌వ‌ల్లితో స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న .. కేంద్ర ప్ర‌భుత్వం ఏ హామీలు అమ‌లు చేశారు, ఏ అమ‌లు చేయాల‌ని గ‌ట్టిగా డిమాండ్ చేయాలి వంటి స‌మ‌గ్ర మైన అవ‌గాహ‌న‌తో ముందుకు పోవాల‌ని జేఏసీ ప్ర‌య‌త్నం చేస్తుంది. వారి ప్ర‌య‌త్నానికి తాము అండ‌గా ఉంటామ‌ని చెప్పారు. వామ‌ప‌క్షాలు చేప‌ట్టిన బంద్ విజ‌యం వంతం చేసి 5 కోట్ల మంది ప్ర‌జ‌లు ఒకే అభిప్రాయంతో ఉన్నామ‌న్న సందేహం కేంద్రానికి పంపామ‌ని అన్నారు. ఈ నెల 18న విజ‌య‌వాడ‌లో మేథావులు, రాజ‌కీయ‌పార్టీలు, ప్రజాసంఘాలు, యువ‌జ‌న సంఘాల‌తో రౌండ్ టేబుల్ స‌మావేశం ఏర్పాటు చేసి, భ‌విష్య‌త్తు కార్య‌చ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రామ‌కృష్ణ తెలిపారు.