ఎన్నికల్లో పోటీ చేయను : ఉమా భారతి

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 03:04 PM
 

లక్నో : భవిష్యత్‌లో జరగబోయే ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయనని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. కానీ పార్టీ కోసం నిరంతరం పని చేస్తానని ఆమె తెలిపారు. వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఉమా భారతి పేర్కొన్నారు. ఇప్పటికే మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడుతున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఉమా భారతి.. ఝాన్సీ నియోజకవర్గం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.