సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్తిపాటిని కలిసిన రేషన్‌ డీలర్లు

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 02:48 PM
 

అమరావతి: సచివాలయంలో మంత్రి ప్రత్తిపాటిని రేషన్‌ డీలర్ల సంఘం సభ్యులు కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు. సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి ప్రత్తిపాటి వారికి హామీ ఇచ్చారు. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుకలపై కమిషన్‌ను రూ.5 నుంచి రూ.10కి పెంచడం పట్ల రేషన్‌ డీలర్లు మంత్రికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.