జలసంరక్షణ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 12:52 PM
 

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జల సంరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో జలసంరక్షణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. పాలవాగులో పూడికతీత పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పొక్లెయినర్ తో పనులు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. ఈ జల సంరక్షణ ఉద్యమంలో అన్ని చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలని పిలుపు నిచ్చారు. జల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. పెద్ద సంఖ్యలో చెక్ డ్యాంలను నిర్మించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 రోజుల పాటు జల సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, అధికారులు పాల్గొన్నారు.