ఉత్తర కాశీలో ఘోర ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 12:39 PM
 

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.