తిరుపతిలో మొదటిసారిగా ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించాం : డిజి ఠాకూర్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 12:19 PM
 

విజయనగరం : రాష్ట్రం వేరుపడిన తర్వాత ఏసీబీకి స్వంత కార్యాలయాలు లేవని ఏసీబీ డీజీ ఠాకూర్‌ అన్నారు. జిల్లాలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ తిరుపతిలో మొదటిసారిగా ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే నేడు విజయనగరంలో కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.