విభజనతో నష్టపోయిన ఏపీకి సహకారం అందించాలి: సీఎం చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 11:31 AM
 

అమరావతి: విభజనతో నష్టపోయిన ఏపీకి కేంద్రం మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేవరకు కేంద్రం చేయూతనివ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడమంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమేనన్నారు.