కడప: కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా అని విలేఖరులు ప్రశ్నించగా అలాంటి ఆలోచన ఏమీ లేదని ముద్రగడ తెలిపారు. కొత్తపార్టీగాని, రాజకీయ పునఃప్రవేశం వంటి ఆలోచనలు లేవని తేల్చి చెప్పారు. నేటి రాజకీయాలు డబ్బు, మద్యంతో కూడుకొని ఉన్నాయని అందుకే తాను రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు ఆనాడే ప్రకటించానని అన్నారు. వెనుకబాటుతనంతో కూడు, గూడు, గుడ్డ కరువై ఇబ్బంది పడుతున్న తన జాతి కోసం రోడ్డుపైకి వచ్చి ఉద్య మం చేపట్టాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.