విజయనగరం జిల్లా గజపతినగరంలో ఓ మెడికల్ షాపులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. షాపులో షార్ట్‌సర్క్యూట్ జరగడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని షాపు యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.